ఖర్గేను అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం ఉత్తరాఖండ్ ఘటనపై భట్టి విక్రమార్క ఆగ్రహం.. నిరసనకారులపై కేసుల నమోదుపై ప్రశ్న
ఖర్గేను అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం ఉత్తరాఖండ్ ఘటనపై భట్టి విక్రమార్క ఆగ్రహం.. నిరసనకారులపై కేసుల నమోదుపై ప్రశ్న న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (ఆయుధం): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను అవమానించేలా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఘటన రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఖర్గే హాజరైన సభా ప్రాంగణాన్ని అనంతరం ‘శుద్ధీకరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధి ఒక సభలో పాల్గొన్నందుకు ఆ ప్రదేశాన్ని...