ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనం - పోలీసుల ముందస్తు చర్యలకు కాంగ్రెస్‌ నాయకుల ప్రశంసలు

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనం పోలీసుల ముందస్తు చర్యలకు కాంగ్రెస్‌ నాయకుల ప్రశంసలు చింతకాని, సెప్టెంబర్‌ 29 (ఆయుధం): చింతకాని మండలంలోని 26 గ్రామాల్లో గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన వేడుకలు సజావుగా సాగడంపై కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ శాఖను అభినందించారు. నిమజ్జన వేడుకల్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు, డీజేల వినియోగంపై నిబంధనల మేరకు తీసుకున్న నియంత్రణ చర్యలు ఫలితాన్నిచ్చాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చింతకాని ఎస్‌ఐ జి. నరేశ్‌ను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సత్కరించారు. ముందస్తు ప్రణాళికతో.. గణేష్‌ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు...