వృద్ధుల సేవలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ

వృద్ధులకు నిత్య అన్నదానం వృద్ధుల సేవలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ నేలకొండపల్లి, సెప్టెంబర్‌ 29 (ఆయుధం): చెరువుమాదారం గ్రామంలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. గత నాలుగు, ఐదు నెలలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రతిరోజూ మధ్యాహ్నం వృద్ధులకు భోజనం అందిస్తూ సంస్థ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలోని 50 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు భోజనం అందిస్తూ వారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ బాధ్యులు మాట్లాడుతూ.. వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అన్నదానం మహాదానమని, వృద్ధులకు సేవ...