🏠 www.aayudham.net
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 8:21 pm Posted by : AAYUDHAM

జగ్గయ్యపేటలో కొనసాగుతున్న ప్రజా పోరుబాట

News Image
జగ్గయ్యపేటలో కొనసాగుతున్న ప్రజా పోరుబాట

క్రిస్టియన్‌పేటలో 16వ రోజు గడపగడపకు వైఎస్సార్‌సీపీ నేతలు

జగ్గయ్యపేట, సెప్టెంబర్‌ 29 (ఆయుధం):

జగ్గయ్యపేట పట్టణంలోని క్రిస్టియన్‌పేట 25వ వార్డులో మంగళవారం సాయంత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 16వ రోజు గడపగడపకు ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని తన్నీరు నాగేశ్వరరావు ప్రజలను కోరినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా 25వ వార్డులోని ప్రజలతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వీధిలైట్లు, తాగునీటికి సంబంధించిన సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని నాయకులు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్‌ ఫిరోజ్‌ ఖాన్‌, వార్డు అధ్యక్షుడు చెవుల చిన్నికృష్ణ, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్విరాజ్‌, స్థానిక నాయకులు చింతమల లక్ష్మణ్‌, ఉసా సురేష్‌, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్‌, మాజీ కౌన్సిలర్‌ చెరుకు నాగేశ్వరరావు, దేవరశెట్టి వీరాంజనేయులు, రామిని ఉపేందర్‌రెడ్డి, సయ్యద్‌ ఫయాజ్‌, కట్ట బుజ్జిబాబు, గొగుల రామకృష్ణ, చావా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home